News March 1, 2025
ప్రజల వద్దే రూ.6,471 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు

దేశంలోని ప్రజల నుంచి 98.18% ₹2,000 నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు RBI వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా 1.82%(₹6,471కోట్లు) నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023 మే 19న ₹3.56 లక్షల కోట్ల విలువైన ₹2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ నోట్లను RBI రీజినల్ కార్యాలయాల వద్ద ఎక్స్ఛేంజ్/డిపాజిట్ చేసుకోవచ్చు.
Similar News
News March 1, 2025
ఇది ప్రభుత్వం కాదు సర్కస్: KTR

TG: SLBC ఘటనపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా ప్రకటన చేస్తున్నారని KTR మండిపడ్డారు. 8 మంది కార్మికుల ఆచూకీపై అధికారిక ప్రకటన చేయాలని CM రేవంత్ను డిమాండ్ చేశారు. ‘మృతదేహాలను గుర్తించామని ఒకరు, PM సంతాపం తెలపలేదని మరో MLA అంటున్నారు. ఇది సర్కస్లా ఉంది. కనీసం ఒక్కరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. ఇదేనా మీరు కార్మికులకు ఇచ్చే గౌరవం? ఇదేనా మీ ప్రభుత్వంలో ప్రాణాలకుండే విలువ?’ అని ప్రశ్నించారు.
News March 1, 2025
విడాకుల వార్తలపై నటుడి భార్య స్పందనిదే

ప్రముఖ నటుడు, రాజకీయ నేత గోవిందాతో <<15584416>>విడాకుల<<>> వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎవరూ విడదీయలేరని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తన ముందుకు రావాలన్నారు. ‘పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. మేం ఇంట్లో ఉంటే షార్టులు ధరించి తిరుగుతుంటాం. గోవిందా రాజకీయాల్లో ఉండటంతో ప్రముఖులు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆయన మరో చోట అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నారు’ అని చెప్పారు.
News March 1, 2025
దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.