News January 29, 2025
చంద్రబాబు కుట్రలు ప్రజలకు తెలుసు: పెద్దిరెడ్డి

AP: తాము 2001లో కొనుగోలు చేసిన భూములకు రెవెన్యూ శాఖ సర్వే చేసిందని, వాటిని ఇప్పుడు అటవీ భూములు అంటున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసని విమర్శించారు. అలాగే, ఎంతమంది YCP నుంచి వెళ్లినా పార్టీకి ఏం కాదన్నారు. VSR రాజీనామా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. పెద్దిరెడ్డి భూములపై ఆరోపణలు రాగా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Similar News
News March 14, 2025
గ్రూప్-3 ఫలితాలు విడుదల

టీజీపీఎస్సీ వరుసగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేస్తోంది. మూడు రోజుల క్రితం గ్రూప్-1, రెండు రోజుల కిందట గ్రూప్-2 రిజల్ట్స్ ఇవ్వగా తాజాగా గ్రూప్-3 ఫలితాలు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్తో పాటు మాస్టర్స్ క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. 1365 గ్రూప్-3 పోస్టులకు గతేడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 2.69 లక్షల మంది హాజరయ్యారు.
Results PDF: <
News March 14, 2025
IPL 2025: బుమ్రా ఎంట్రీ ఎప్పుడంటే?

ఐపీఎల్-2025 ప్రారంభంలో ముంబై ఆడే కొన్ని మ్యాచులకు బుమ్రా దూరం కానున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఆయన జట్టులో చేరతారని క్రీడా వర్గాలు తెలిపాయి. వెన్ను గాయంతో బాధపడుతున్న ఆయన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి తెలిసిందే. కాగా MI తన తొలి మ్యాచును మార్చి 23న CSKతో ఆడనుంది. ఆ తర్వాత 29న గుజరాత్ టైటాన్స్, 31న KKRతో తలపడనుంది. బుమ్రా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.
News March 14, 2025
సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు: CM

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.