News September 19, 2024

వరదల తర్వాత అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయింది: VSR

image

AP: విజయవాడ వరదల తర్వాత రాజధాని అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుడమేరు వరదలు, అమరావతి భవిష్యత్‌పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఒకరి కల కోసం రాష్ట్రానికి కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదు. పెట్టుబడి దారుల విశ్వాసం సన్నగిల్లింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 20, 2024

తిరుమల లడ్డూపై రిపోర్టు.. ఈ సందర్భాల్లో తప్పు అయ్యే ఛాన్స్: NDDB

image

AP: తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు వాడారంటూ వైరలవుతున్న NDDB-CALF రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ‘ఈ రిపోర్టు కొన్నిసార్లు తప్పు అయ్యే అవకాశం ఉంది. వెజిటబుల్ ఆయిల్స్ అధికంగా ఉండే మేతను ఆవులకు ఎక్కువగా ఇవ్వడం/తక్కువ ఆహారం పెట్టడం/పాలలోని కొలెస్ట్రాల్‌ను తొలగించడం, ఇతర టెక్నికల్ అంశాల వల్ల ఫలితాలు తప్పుగా రావొచ్చు’ అని రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిపింది.

News September 20, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 20, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:09 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.26 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.