News January 3, 2025

తెలంగాణ ప్రజలకు ‘KA మోడల్’ ఛార్జీల భయం!

image

TG ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు <<15052988>>కర్ణాటక<<>> మోడల్‌నే అనుసరించింది. ఇప్పుడదే కొంపముంచేలా ఉంది. స్కీములకు డబ్బులేక అక్కడి సర్కారు ఎడాపెడా అప్పులు చేస్తూ, బస్సు సహా అన్ని ఛార్జీలూ పెంచేస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా సహా స్కీములకు FY25లో ₹37,850CR తెచ్చిన రేవంత్ సర్కార్ మార్కెట్ సెక్యూరిటీల రూపంలో మరో ₹37,850CR అప్పుచేయనుంది. 10 ఏళ్లలో ₹2.86L CR అప్పు తీర్చాల్సిన TG GOVT ఇక వాయింపులు మొదలుపెట్టనుందా?

Similar News

News November 7, 2025

‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

image

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.

News November 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 7, 2025

సూర్య బ్యాడ్ ఫామ్.. 18 ఇన్నింగ్సుల్లో నో ఫిఫ్టీ!

image

IND టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు గత 18 టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. 7 సార్లు(+3 డకౌట్లు) సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యారు. అత్యధిక స్కోర్ 47*. కెప్టెన్సీ భారం వల్లే సూర్య ఫెయిల్ అవుతున్నారా? లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పుల వల్ల విఫలం అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది T20WC నేపథ్యంలో సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.