News November 27, 2024

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారు: మోదీ

image

TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారని ప్రధాని మోదీ అన్నారు. TG BJP నేతలతో భేటీ అనంతరం ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు BRS దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారని, ఇప్పుడు ఎంతో ఆశతో BJP వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో BJP ఉనికి వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, BRSల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా BJP స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.

Similar News

News January 29, 2026

మున్సిపల్ ఛైర్మన్ పోస్టు ఖరీదు రూ.3కోట్లు?

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల కన్నా ముందే ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. MLAలు, సీనియర్ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికలలో పార్టీ ఖర్చులను పూర్తిగా భరిస్తామని, ఛైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని విన్నవిస్తున్నారు. రూ.3 కోట్ల వరకు చెల్లించడానికి కూడా రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల ఆమేరకు ఒప్పందాలూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో FEB 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

News January 29, 2026

మేడారం జాతర.. రేపు మరో జిల్లాలో సెలవు

image

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రేపు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ములుగు జిల్లాలోనూ రేపు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్‌తో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

News January 29, 2026

జంక్ ఫుడ్‌పై ఆ సమయంలో ప్రచారం వద్దు: ఆర్థిక సర్వే

image

జంక్ ఫుడ్‌పై కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ యాడ్స్‌పై నిషేధం విధించాలని చెప్పింది. చిన్నారుల పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌పైనా ఆంక్షలు విధించాలని పేర్కొంది. గత 14 ఏళ్లలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మకాలు 150 శాతం పెరిగాయని తెలిపింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు(HFSS) కలిగిన ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై హెచ్చరికలు ఉండాలని సూచించింది.