News August 31, 2024
ఆ ప్రాంతాల ప్రజలు బయటకు రావొద్దు: లోకేశ్

AP: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని మంత్రి నారా లోకేశ్ సూచించారు. కొండచరియలు విరిగిపడే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ, విపత్తు నిర్వహణ శాఖ పంపే అలర్ట్ మెసేజ్లను గమనిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. టీడీపీ నేతలు, కార్యకర్తలు బాధితులకు సహాయం అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
సీఎం ఓయూ పర్యటన వాయిదా

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.
News December 5, 2025
VIRAL: ఫ్లైట్స్ క్యాన్సిల్.. లగేజీ కోసం తిప్పలు!

400కు పైగా ఇండిగో విమానాలు రద్దవడంతో బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. తిరిగి ఇంటికెళ్లాల్సిన ప్రయాణీకులు తమ లగేజీ ఎక్కడుందో వెతుక్కునేందుకు ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో బ్యాగులు ఒకేచోట ఉంచడంతో తమ వస్తువుల జాడ కోసం ప్రయాణీకుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎయిర్లైన్స్ యాజమాన్యంపై కొందరు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
News December 5, 2025
వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: సీఎం చంద్రబాబు

AP: పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని CM చంద్రబాబు ఉపాధ్యాయులు, పేరెంట్స్కు చెప్పారు. పార్వతీపురం మన్యం(D) భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో CM పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.


