News November 3, 2024

రాహుల్‌ను వ‌య‌నాడ్ ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు: ప‌్రియాంకా గాంధీ

image

రాహుల్‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్పుడు స‌త్యం కోసం పోరాడుతున్న‌ ఆయ‌న్ను వ‌య‌నాడ్ ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని ప్రియాంకా గాంధీ అన్నారు. ఆదివారం మనంతవాడి స‌భ‌లో ఆమె మాట్లాడుతూ స్థానిక ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చేలా వైద్య స‌దుపాయాలు, రోడ్లు, ఉపాధి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. మోదీ వ్యాపారవేత్తల కోసం మినహా ప్రజల కోసం పనిచేయరని విమర్శించారు.

Similar News

News December 26, 2024

CWC మీటింగ్‌లో మ్యాప్ వివాదం

image

బెళ‌గావిలో CWC మీటింగ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన భార‌త చిత్ర‌ప‌టంలో క‌శ్మీర్‌లోని కొన్ని భాగాలు లేక‌పోవ‌డంపై వివాదం చెల‌రేగింది. దీనిపై వివరణ ఇవ్వాలని BJP డిమాండ్ చేసింది. జార్జ్ సొరోస్‌తో క‌ల‌సి దేశాన్ని అస్థిర‌ప‌రిచేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు సిగ్గుచేట‌ని విమ‌ర్శించింది. అయితే ఆ ఫ్లెక్సీని పార్టీ కాకుండా స్థానిక శ్రేణులు ఎవ‌రో ఏర్పాటు చేసిన‌ట్టు కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇచ్చింది.

News December 26, 2024

70 గంటలుగా బోరుబావిలో.. చిట్టి తల్లికి నరకం

image

రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో 3ఏళ్ల చిన్నారి 700 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 70 గంటల క్రితం ఆమె పడిపోగా అప్పటి నుంచీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాట్ హోల్ మైనింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలిక ప్రస్తుతం 150 అడుగుల వద్ద ఉందన్నారు. పైపుతో ఆక్సిజన్ పంపిస్తున్నామని తెలిపారు. చిట్టితల్లి క్షేమంగా బయటపడాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

News December 26, 2024

ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్

image

TG: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనను ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రూ.5వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.