News June 4, 2024
ప్రజలకు గుర్తుంది.. పార్టీలకు గుర్తే మిగిలింది!

మహారాష్ట్రలో శివసేనను చీల్చి అసలైన శివసేన గుర్తు పొందిన CM ఏకనాథ్ శిండే వర్గానికి 5 సీట్లొచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వ శివసేన 11 చోట్ల గెలుపు వైపు పయనిస్తోంది. ఇక NCPని విభజించి ఆ లోగో పొందిన అజిత్ పవార్ గ్రూపుకు ఒక్క సీటే దక్కగా శరద్ పవార్ NCP 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో చీల్చిన వర్గాలకు గుర్తులు తప్ప ఓట్లు మిగులలేదు. ఓటర్లంతా గుర్తుంచుకుంటారు అనేందుకు ఇదే ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News February 9, 2026
IIM లఖ్‌నవూలో ఉద్యోగాలు

<
News February 9, 2026
భవిష్యత్ తరాల కోసం ఫండ్.. నార్వే విజన్ సూపర్!

క్రూడ్ ఆయిల్ ద్వారా వచ్చే రాబడిని ఎలా ఉపయోగించాలనే విషయంలో నార్వే ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1969లో చమురు నిల్వలు కనుగొన్నాక భారీగా వచ్చే డబ్బు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాల కోసం లాభాల్లోంచి కొంత పక్కనపెట్టి $2T ఫండ్‌ను(₹180 లక్షల కోట్లు) ఏర్పాటు చేసింది. ఈ నిధిని విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టి, వచ్చే లాభాలలో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తూ వస్తోంది.
News February 9, 2026
ప్రెగ్నెన్సీలో ఐరన్ లెవల్స్ పెరగాలంటే?

ప్రెగ్నెన్సీలో ఐరన్ లెవల్స్ సరిగా లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఖర్జూరాలు, అంజీర్, బ్లాక్ రైజిన్స్, బీట్‌రూట్, ఉసిరి రసం, కొబ్బరి, బెల్లం లడ్డూలు, కొబ్బరినీరు, బాదంపప్పు, గుమ్మడిగింజలు, వేయించిన శనగలు, రాగులు, దానిమ్మగింజలు, పెసలు, నేరేడు పండ్లు డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


