News August 15, 2024

అన్న క్యాంటీన్లకు ప్రజలు విరాళాలివ్వాలి: సీఎం చంద్రబాబు

image

AP: దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పయనిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘మాది పేదల ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నప్పటికీ సామాజిక పింఛన్లు పెంచి అందిస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ప్రజలు భాగస్వాములు కావాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాల రోజున విరాళాలు ఇస్తే మీ పేరున భోజనం పెడతాం’ అని తెలిపారు.

Similar News

News July 5, 2025

సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గిన గుకేశ్

image

గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా క్రోయేషియాలో జరుగుతున్న సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్&బ్లిట్జ్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గారు. ఫైనల్ రౌండ్లో USకు చెందిన వెస్లేపై విజయం సాధించారు. నిన్న ఐదో రౌండ్లో వరల్డ్ No.1 కార్ల్‌సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ్టి నుంచి బ్లిట్జ్ ఫార్మాట్ మొదలవనుంది. ర్యాపిడ్, బ్లిట్జ్ 2 ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా ఓవరాల్ విన్నర్‌‌ను ప్రకటిస్తారు.

News July 5, 2025

డీఎస్సీ నియామక ఉత్తర్వులపై ఆదేశాలు

image

AP: ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఆయన సమీక్షించారు. డిగ్రీ విద్యార్థులపై భారం తగ్గేలా UGC నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చూడాలని సూచించారు. 2024-25కి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

News July 5, 2025

జులై 5: చరిత్రలో ఈరోజు

image

1906: నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1927: రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం
1980: సినీ నటుడు కళ్యాణ్‌రామ్ జననం(ఫొటోలో)
1995: బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జననం(ఫొటోలో)
2017: సంఘసేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం