News March 30, 2024
అన్నం తినేవాళ్లు పార్టీ మారరు: కౌశిక్ రెడ్డి

TG: అన్నం తినే వారు ఎవరూ పార్టీ మారరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘కడియం శ్రీహరి పార్టీకి తీరని ద్రోహం చేశారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయన పార్టీని నమ్మించి గొంతు కోశారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఛీ కొడుతున్నారు. ఆ నేతలకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజం తెలుస్తుంది’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News October 24, 2025
అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

అయోడిన్ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అయోడిన్ను గ్రహించి, దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. ఇది తగ్గితే శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం, శ్వాస, గుండెవేగం, జీవక్రియ దెబ్బతింటాయి. అయోడిన్ లోపిస్తే గాయిటర్, రొమ్ముల్లో క్యాన్సర్ రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News October 24, 2025
బస్సు ప్రమాదం: నువ్ చాలా పెద్ద తప్పు చేశావ్

డ్రైవర్నే దేవుడిగా భావించి ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కుతారు. కానీ <<18087723>>vKaveri<<>> విషాదంలో మెయిన్ డ్రైవర్ తప్పులు చేశాడనే విమర్శలొస్తున్నాయి. బైక్ను ఢీకొట్టగానే బస్ ఆపితే మంటలు చెలరేగేవి కాదు. పైగా ఫైర్ సేఫ్టీతో కాక నీటితో మంటలు ఆర్పే యత్నం చేసి పరిస్థితి చేయి దాటిందని పారిపోయాడు. కనీసం ప్యాసింజర్స్ దిగేలా డోర్ తీయాల్సింది. ప్రమాదంతో హైడ్రాలిక్ కేబుల్స్ తెగి డోర్ తెరుచుకోక చాలామంది బయటకు రాలేక చనిపోయారు.
News October 24, 2025
బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై PM మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై AP Dy.CM పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు విజ్ఞప్తి చేశారు.


