News April 14, 2025
అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రజా ప్రభుత్వం: CM రేవంత్

TG: అంబేడ్కర్ జయంతి సందర్భంగా CM రేవంత్ నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో తమ ప్రభుత్వం ఎన్నో అడుగులు వేసిందని ట్వీట్ చేశారు. SC వర్గీకరణ, బడుగు- బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టరూపం, యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య, ఇందిరమ్మ భరోసా పథకం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతికి శ్రీకారం వంటివి ఉదాహరణగా చెప్పారు.
Similar News
News October 28, 2025
మీ టీవీపై ఇంకా ఈ స్టిక్కర్లు ఉంచారా?

చాలామంది కొత్త TV కొన్నప్పుడు దాని డిస్ప్లేపై ఉండే ఫీచర్ల స్టిక్కర్లను తొలగించరు. పిల్లలు తొలగించినా పేరెంట్స్ తిడుతుంటారు. అయితే ఈ స్టిక్కర్లుండటం TVకి మంచిది కాదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. TV ఆన్లో ఉన్నప్పుడు వేడి పుట్టి ఈ స్టిక్కర్లు డిస్ప్లేని దెబ్బతీస్తుంటాయి. అలాగే రంగులూ మారిపోతాయని చెబుతున్నారు. స్టిక్కర్ చుట్టూ ఉన్న భాగం మాత్రమే నిగనిగలాడుతూ, మిగతా భాగం కాంతిహీనంగా మారుతుందట.
News October 28, 2025
120 ఉద్యోగాలకు నోటిఫికేషన్

BSNLలో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్(టెలికాం, ఫైనాన్స్) ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. 60% మార్కులతో బీఈ, బీటెక్ లేదా తత్సమాన ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, సీఎంఏ పాసైన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. త్వరలో దరఖాస్తు తేదీలను అధికారులు ప్రకటించనున్నారు.
* మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News October 28, 2025
MCEMEలో 49 ఉద్యోగాలు

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.


