News February 11, 2026

Peoples Pulse.. ఉమ్మడి మెదక్ ఎగ్జిట్ పోల్స్ ఇవే!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు సంబంధించి 403 వార్డుల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 166-174 వార్డులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BRS 172-180, BJP 35-42, MIM 2-4, ఇతరులు 8- 12 వార్డులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

Similar News

News February 12, 2026

సంగారెడ్డి: ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో!

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో ఎవరీ అదృష్టం వరిస్తుందో తెలియాలి అంటే 13న కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.

News February 12, 2026

నాస్తికుడి కళ్లు తెరిపించిన రాఘవేంద్ర స్వామి

image

రాఘవేంద్ర స్వామి మహిమలు అనిర్వచనీయం. ఓసారి వేదమంత్రాలను పరిహసించిన ఓ నాస్తికుడు ఎండు రోకలి చూపి దాన్ని చిగురింపజేయమని సవాలు చేశాడు. స్వామివారు చిరునవ్వుతో మంత్రజలాన్ని దానిపై చిలకరించాడు. అప్పుడు అందరూ చూస్తుండగానే ఆ ఎండు కర్ర కాస్త పచ్చని ఆకులతో చిగురించింది. ఈ అద్భుతం చూసిన ఆ నాస్తికుడు స్వామివారి పాదాలకు శరణు కోరాడు. ప్రకృతి నియమాలను కూడా భగవంతుని నామం మార్చగలదని ఈ ఘటన నిరూపిస్తుంది.

News February 12, 2026

విండీస్ విజయం.. ఇతర జట్లకు వార్నింగే!

image

టీ20 క్రికెట్ సంచలనాలకు మారుపేరు. ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతమని రికార్డులు చెబుతున్నాయి. రెండు సార్లు కప్పు గెలిచిన ఈ జట్టు తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు. T20 WC-2026 ఫేవరెట్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించి ఇతర జట్లకు అదే హెచ్చరికలు ఇచ్చింది. హోప్, హెట్‌మెయర్, రూథర్‌ఫోర్డ్, పావెల్ వంటి హిట్టర్లు చెలరేగితే WIకు తిరుగుండదు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని జట్లకు షాక్‌ ఇస్తుందో చూడాలి.