News October 3, 2024

ప్రజా ప్రతినిధులు హుందాతనాన్ని కాపాడుకోవాలి: రాజమౌళి

image

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను దర్శకధీరుడు రాజమౌళి ఖండించారు. నిరాధారమైన ఆరోపణలను సహించేది లేదన్నారు. మరీ ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు హద్దులను గౌరవిస్తూ, హుందాతనాన్ని కాపాడుకోవాలని ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని వంటి స్టార్లు సురేఖ వ్యాఖ్యలను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 4, 2025

అదనపు సిబ్బందిని తీసుకోండి.. SIRపై సుప్రీంకోర్టు

image

‘SIR’ విధుల్లో ఒత్తిడితో BLOల <<18435836>>ఆత్మహత్య<<>> ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బందులు వచ్చినప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పని గంటలనూ తగ్గించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ECతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అయితే సరైన కారణంతో విధుల నుంచి మినహాయింపు కోరితే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్‌: ప్రజలకు ఉచిత ప్రవేశం!

image

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను పబ్లిక్‌కు చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సదస్సులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, నిపుణులతో సెషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించింది. JBS, MGBS నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా అందించనుంది.

News December 4, 2025

CBN దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు: జగన్

image

AP: సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని YCP చీఫ్ జగన్ విమర్శించారు. శ్రీవారిని ఆయన అభాసుపాలు చేశారని దుయ్యబట్టారు. ‘నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్నారు. ఆ నెయ్యితో చేసిన లడ్డూలు భక్తులు తిన్నారనడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? ప్రతి ట్యాంకర్‌ను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.