News December 26, 2024

YCPపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది: సజ్జల

image

AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.

Similar News

News December 26, 2024

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం ఆవేదన

image

TG: సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఈ భేటీకి మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమ నుంచి 46 మంది హాజరయ్యారు.

News December 26, 2024

కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?

image

TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.

News December 26, 2024

బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

image

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.