News October 18, 2024

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: సీఎం చంద్రబాబు

image

AP: ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ వ్యవస్థలను నాశనం చేశారని, కేంద్ర నిధులను కూడా మళ్లించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉందని టీడీపీ ప్రజాప్రతినిధులతో సమావేశంలో తెలిపారు. పార్టీని నమ్ముకున్న కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని, వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఎన్డీఏ పక్షాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News January 3, 2025

డబుల్ డెక్కర్‌గా విజయవాడ, వైజాగ్ మెట్రోలు

image

AP: విజయవాడ, వైజాగ్‌లో మెట్రో ప్రాజెక్టులకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్లను సీఎం చంద్రబాబు తాజాగా ఆమోదించారు. డబుల్ డెక్కర్ ప్లాన్‌లో పైన మెట్రో ట్రాక్, కింద వాహనాలకు ఫ్లై ఓవర్ ఉంటుంది. వైజాగ్‌లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకూ డబుల్ డెక్కర్ ఉంటుంది.

News January 3, 2025

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

image

TG: రేషన్ కార్డుదారులకు FEB లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6KGలు ఇవ్వాలని, శనివారం జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని, అందుకే 2నెలలు తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

News January 3, 2025

2 వికెట్లు డౌన్.. పెవిలియన్‌కు భారత ఓపెనర్లు

image

సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు‌కు తొలి 10 ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్లలో తొలుత రాహుల్ (4), తర్వాత జైస్వాల్ (10) ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(4), గిల్(3) ఉన్నారు. కోహ్లీ క్రీజులోకి రాగానే తొలి బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లోకి వెళ్లింది. తొలుత అందరూ ఔట్ అని భావించినా బాల్ గ్రౌండ్‌ను తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. 9 ఓవర్లకు భారత స్కోర్ 22/2.