News March 18, 2024

అధికారం కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం: నరేంద్ర మోదీ

image

తనకు అధికారం కాపాడుకోవడం కన్నా ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని, పసుపు ధరను భారీగా పెంచామన్నారు. దేశ ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు.

Similar News

News July 5, 2024

ఎల్లారెడ్డిపేట: ప్రవర్తన మార్చుకోని మహిళకు రూ.50 వేలు జరిమానా

image

ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రవర్తన మార్చుకోకుండా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేల జరిమానా విధించారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆనరాశి పోచవ్వ 2023 అక్టోబర్‌లో నాటుసారా తరలిస్తూ పట్టుబడింది. ఎల్లారెడ్డిపేట MRO ఆఫీస్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశారు. అయితే మరోసారి నాటుసారా తరలిస్తూ ఆమె పట్టుబడింది. దీంతో ఆమెకు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ CI శ్రీనివాస్ తెలిపారు.

News July 5, 2024

KNR: నిరుపయోగంగా మారుతున్న రైతువేదికలు

image

రైతులకు ఆధునిక ,సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు ఒక వేదికను నిర్మించాలని గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఆరేళ్ల క్రితం అట్టహాసంగా రైతువేదికల నిర్మాణం చేపట్టగా అసంపూర్తి పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ మండలంలో దుర్శేడు, బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో నిర్మించిన రైతువేదిక భవనాల్లో సౌకర్యాలు లేక, అసంపూర్తిగా నిర్మాణాలు చేయగా, ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.

News July 5, 2024

కరీంనగర్: జలపాతం వద్ద తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.