News February 28, 2025
మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు

AP: రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీనిపై వారికి అవగాహన పెంచాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే పనితీరు బాగుండాలి. మళ్లీ సభకు రావాలనే భావనతో పని చేయాలి. విభేదాలు, గ్రూపులను సహించను. ఎంపీలతో కలిసి సమన్వయం చేసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News February 28, 2025
కోహ్లీ ముంగిట మూడు రికార్డులు!

CTలో భాగంగా ఎల్లుండి న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచులోనూ కోహ్లీ సెంచరీ చేస్తే ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు(52) చేసిన బ్యాటర్‌గా నిలుస్తారు. సచిన్ టెస్టుల్లో 51, కోహ్లీ వన్డేల్లో 51 సెంచరీలతో టాప్‌లో ఉన్నారు. 51 రన్స్ చేస్తే భారత్ తరఫున CTలో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలుస్తారు. అలాగే 85 రన్స్ చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి NZపై 3వేల రన్స్ చేసిన ప్లేయర్‌గా అరుదైన క్లబ్‌లో విరాట్ చేరుతారు.
News February 28, 2025
CT: వర్షంతో నిలిచిన మ్యాచ్

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన AFG 273 పరుగులు చేయగా, ఆసీస్ 12.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది. మరోవైపు పవర్ ప్లేలో అత్యధిక పరుగులు(10 ఓవర్లలో 90) చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. ఇక AUS ప్లేయర్ హెడ్ ఆ జట్టు తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(34 బంతుల్లో 51) చేశారు. ఇరు జట్లు సెమీస్ చేరేందుకు ఈ మ్యాచ్ ఫలితం కీలకంగా ఉంది.
News February 28, 2025
రోజులో ఏ సమయంలో నీళ్లు తాగాలంటే?

ఉదయం పరగడుపునే 1 లీటర్ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగాలి. గోరు వెచ్చటి నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. పేగులు శుభ్రంగా మారతాయి. అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలి. ఇలా చేస్తే నీళ్లు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. వ్యాయామానికి ముందు గ్లాసు నీరు తీసుకోవాలి. నిద్ర పోయేముందు ఓ గ్లాసు నీరు తాగాలి.