News April 12, 2024

విద్యార్థినులకు ‘పీరియడ్’ సెలవులు: పంజాబ్ వర్సిటీ

image

చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ కీలక ప్రకటన చేసింది. ఇకపై విద్యార్థినులకు పీరియడ్ సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒక సెమిస్టర్‌కు గరిష్ఠంగా 4 లీవ్‌లు తీసుకునేందుకు అనుమతి ఇస్తామని పేర్కొంది. అయితే సెమిస్టర్, ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు ఉండవని వెల్లడించింది. కాగా కేరళలోని కొచ్చిన్ వర్సిటీ, నల్సార్(HYD), గువాహటి వర్సిటీ, తేజ్‌పూర్ వర్సిటీ విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.

Similar News

News November 16, 2024

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్లు

image

టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు. సడన్‌గా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్‌లో ‘ఉండిపో’, ఆచార్య సినిమాలో ‘నీలాంబరి’ పాటలు పాడారు. వేర్వేరుగా ఎన్నో హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు.

News November 16, 2024

MP మీటింగ్‌లో మటన్ గొడవ.. కొట్టుకున్నారు

image

UPలోని మిర్జాపుర్‌లో BJP MP వినోద్ కుమార్ బింద్ కార్యాలయంలో ఓ కమ్యూనిటీ సమావేశం, విందు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది హాజరయ్యారు. విందుకు వచ్చిన అతిథుల్లో ఒక వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా కేవలం గ్రేవీ వేయడంతో రచ్చ మొదలైంది. తనకు ముక్కలు వేయలేదని వాగ్వాదానికి దిగిన సదరు అతిథి వడ్డించే వ్యక్తి చెంపపై కొట్టడం, తోపులాట జరిగి కొట్టుకున్నారు. ఆ తర్వాత కొందరు కవర్లలో మటన్‌ను నింపుకొని వెళ్లిపోయారు.

News November 16, 2024

నేటి నుంచి డీఎస్సీ ఉచిత శిక్షణ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో నేటి నుంచి డీఎస్సీకి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు ₹1,500 స్టైఫండ్, మెటీరియల్ కోసం ₹1,000 ఇస్తామన్నారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSCని విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రభుత్వం 5,200 మంది BC, SC, STలకు, 520 మంది EWS అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్‌ ఇవ్వనుంది.