News April 11, 2025
వెయ్యి రోజులుగా ఆగని పీరియడ్స్.. మహిళ ఆవేదన

తనకు వెయ్యి రోజులుగా రుతుస్రావం అవుతున్నట్లు అమెరికాకు చెందిన టిక్‌టాకర్ పాపి వెల్లడించారు. 950 రోజుల తీవ్ర ఆవేదన తర్వాత ఆమె ఈ విషయాన్ని తన యూజర్లతో పంచుకున్నారు. మహిళలకు సాధారణంగా నెలలో 3-7 రోజుల పాటు పీరియడ్ బ్లీడింగ్ జరుగుతుంటుంది. మొదట్లోనే టెస్టులు చేయించానని, వైద్యులు సైతం అయోమయంలో పడినట్లు ఆమె తెలిపారు. చివరికి తనకు బైకార్న్యుయేట్ యుట్రస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
Similar News
News April 18, 2025
ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలకు కపిల్ సిబల్ కౌంటర్

రాష్ట్రపతికి గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేదన్న ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ <<16129153>>వ్యాఖ్యలపై<<>> రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఎంపీ కపిల్ సిబల్ ధన్‌ఖడ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘శాసన వ్యవస్థ విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా కలగజేసుకుంటుంది. అది దాని హక్కు. న్యాయస్థానాలు స్వతంత్రంగా పనిచేయడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు.
News April 18, 2025
త్వరలో అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు వెళ్లనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. నాసా అనుమతి పొందిన ప్రైవేట్ స్పేస్‌ఫ్లైట్‌లో ఆయన ప్రయాణించనున్నారు. గత 40 ఏళ్లలో స్పేస్‌లోకి వెళ్లిన తొలి ఇండియన్‌గా శుక్లా నిలవనున్నారు. 1984లో తొలిసారి రాకేశ్‌శర్మ స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మిషన్ ఇస్రో, నాసా భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది.
News April 18, 2025
చెత్త నుంచి సంపదతోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యం: సీఎం

AP: స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ‘ఈసారి e-వ్యర్థాల సేకరణ-సురక్షితంగా రీసైకిల్ చేయడమనే థీమ్‌ను ఎంచుకున్నాం. చెత్త నుంచి సంపద సృష్టితోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది వ్యర్థాల సేకరణ కేంద్రాల నినాదం కావాలి. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి’ అని ట్వీట్ చేశారు.