News September 24, 2025

FMG విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్లు: సత్యకుమార్

image

AP: విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన వారికి ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ’APMCకి 2023-24లో 653 దరఖాస్తులు రాగా 318 పరిష్కారమయ్యాయి. మిగతా వారి సమస్యపై కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశాం. ఆన్లైన్ తరగతులను కోల్పోయిన విద్యార్థులు అంతే కాల వ్యవధితో ఆన్లైన్లో చదివితేనే కోర్సు పూర్తయినట్లు గుర్తిస్తామని NMC పేర్కొంది’ అని మంత్రి వివరించారు.

Similar News

News September 25, 2025

సెప్టెంబర్ 25: చరిత్రలో ఈ రోజు

image

1920: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జననం(ఫొటో)
1939: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం
1974: ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురగదాస్ జననం
1958: స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం
2019: హాస్యనటుడు వేణుమాధవ్ మరణం
2020: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం మరణం
➣వరల్డ్ ఫార్మాసిస్ట్ డే

News September 25, 2025

సీడీఎస్ అనిల్ కుమార్ పదవీకాలం పొడిగింపు

image

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ కుమార్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్ 30తో ఆయన పదవీకాలం ముగియనుండగా వచ్చే ఏడాది మే 30 వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 40 ఏళ్ల పాటు సైన్యంలో పలు హోదాల్లో పనిచేసిన చౌహాన్ 2021 మే నెలలో ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. 2022 సెప్టెంబర్‌లో ఆయనను దేశ రెండో సీడీఎస్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.

News September 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.