News September 7, 2025

రూ.27 వేలతో ఆ దేశంలో శాశ్వత నివాసం

image

విదేశీయులు రూ.27 వేలకే పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు బ్రెజిల్‌ అనుమతి ఇస్తోంది. 2 వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు కూడా ముందుగా తాత్కాలిక నివాసానికి అర్హులవుతారు. ఆ తర్వాత పర్మినెంట్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చు. పాస్‌పోర్టు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, లీగల్ ఎంట్రీ, జాబ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ సర్టిఫికెట్ ఉంటే శాశ్వత నివాస హక్కు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తానికి 4 నుంచి 6 నెలలు పడుతుంది.

Similar News

News September 8, 2025

పొలాల శత్రువు.. వయ్యారిభామ(1/3)

image

పంట పొలాల్లో అత్యంత ప్రమాదకరమైన, వేగంగా వ్యాపించే మొక్క పార్థీనియం(వయ్యారిభామ). ఇది వాతావరణ అనుకూల పరిస్థితుల్లో 4 వారాల్లో పుష్పించి దాదాపు 10K-50K వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గాలి ద్వారా 3KM దూరం వరకు విస్తరించి మొలకెత్తుతాయి. భూమి నుంచి నత్రజనిని వేర్ల ద్వారా గ్రహించే శక్తి ఇతర మొక్కలతో పోలిస్తే వయ్యారిభామకు 10 రెట్లు ఎక్కువ. ఇది మొలిచిన చోట్ల పైరుల ఎదుగుదల ఆగిపోతుంది.

News September 8, 2025

వయ్యారిభామ కట్టడి మార్గాలు(3/3)

image

* ఇవి తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడే పీకివేసి తగలబెట్టాలి.
* పంట మొలకెత్తక ముందు లీటర్ నీటికి 4 గ్రాముల అట్రాజిన్, మొలకెత్తిన 20 రోజులకు 2,4-D సోడియం సాల్ట్ లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించుకోవచ్చు.
* ఈ మందులు పక్క పంటలపై పడకుండా జాగ్రత్త పడాలి.
* కసివింద, వేంపల్లి, తోటకూర, పసర కంప మొదలైన మొక్కలు పార్థీనియం మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి.

News September 8, 2025

వయ్యారిభామ వలన కలిగే నష్టాలు(2/3)

image

☛ ఈ కలుపు మొక్క పంట పొలాల్లో 40% దిగుబడి, పశుగ్రాసాల్లో 90% దిగుబడి తగ్గిస్తుంది.
☛ ఈ మొక్క ఉత్పత్తి చేసే పుప్పొడి టమాట, మిరప, వంగ, మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటి ఉత్పత్తికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
☛ దీని పుప్పొడిని పీలిస్తే మనుషులకు డెర్మటైటిస్, ఎగ్జిమా, ఉబ్బసం, తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబడటం, శ్వాసనాళాల్లోకి వెళ్లి బ్రాంకైటిస్ లాంటి వ్యాధులను కలుగజేస్తుంది.