News July 26, 2024
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: CM రేవంత్

TG: ధరణి పోర్టల్లో సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. సచివాలయంలో ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులపై సమీక్ష నిర్వహించారు. ‘ధరణి సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. వాటి ఆధారంగా సమగ్ర చట్టం తేవాలి. అవసరమైతే అసెంబ్లీలో దీనిపై చర్చ పెడదాం’ అని అన్నారు.
Similar News
News November 23, 2025
వివిధ పండ్ల తోటలు – పిందె రాలడానికి కారణాలు

☛ మామిడి -పుష్పాలలో పరాగ సంపర్క లోపం, పుష్ప దశలో వర్షం, హార్మోన్ల అసమతుల్యత, రసం పీల్చే పురుగుల దాడి
☛ నిమ్మ, బత్తాయి – అధిక వర్షాలు, అధిక ఎరువుల వాడకం, పాము పొడ పురుగు
☛ ద్రాక్ష – అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, అధిక తేమ, బూడిద, ఆంత్రాక్నోస్ తెగులు
☛ బొప్పాయి – పరాగసంపర్కం లోపం, బోరాన్ లోపం, అధిక వర్షం లేదా నీరు నిల్వ ఉండిపోవడం, బూడిద తెగులు పుష్పాలపై రావడం వల్ల పిందెలు రాలిపోతాయి.
News November 23, 2025
ఆన్లైన్లో సర్వపిండి, సకినాలు!

TG: సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు వంటి పిండివంటలకు బ్రాండింగ్ కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్(D)లోని మహిళా సంఘాలకు వీటి తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం వీరు FSSAI ధ్రువీకరణతో విక్రయాలు చేస్తున్నారు. ఈ పిండివంటల అమ్మకాలు పెంచేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
News November 23, 2025
టెక్ దిగ్గజాలందర్నీ ఒక చోటకు చేర్చిన AI

టెక్ బిలియనీర్ల ఫొటోలతో క్రియేట్ చేసిన ‘వన్ ట్రిలియన్ స్క్వాడ్’ AI పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శామ్ ఆల్ట్మన్, జెన్సెన్ హువాంగ్ను ఏఐ సహాయంతో పార్టీలో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. సమాంతర విశ్వంలో ఒక చోట, సరదాగా కలుసుకున్న, వన్ ట్రిలియన్ స్క్వాడ్ సమావేశం అంటూ ఫొటోలకు క్యాప్షన్స్ ఇచ్చారు.


