News August 26, 2024
నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం: CM రేవంత్

TG: నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని CM రేవంత్ అన్నారు. 90రోజుల్లోనే 30వేల మందికి నియామకపత్రాలు అందించామని చెప్పారు. సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన సందర్భంగా సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ‘సివిల్స్ అభ్యర్థులు వివిధ రాష్ట్రాలకు, ఈ దేశానికి సేవలందిస్తే తెలంగాణ ప్రతిష్ఠ పెరుగుతుంది’ అని సీఎం అన్నారు.
Similar News
News December 1, 2025
కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్‌ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.
News December 1, 2025
నేడు అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: ‘దిత్వా’ ప్రభావంతో ఇవాళ NLR, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. కోనసీమ, ప.గో., కృష్ణా, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, KDP, అన్నమయ్య, CTR జిల్లాల్లో భారీ వర్షాలు.. కాకినాడ, తూ.గో., ఏలూరు, NTR తదితర జిల్లాల్లోనూ మోస్తరు వానలకు అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, KDP, NLR, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు.
News December 1, 2025
గర్భిణుల్లో వికారానికి కారణమిదే..

ప్రెగ్నెన్సీలో వికారం కామన్. అయితే ఇది గర్భంలోని శిశువును రక్షించే ప్రక్రియలో భాగమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. కొత్తగా వచ్చిన శిశువుని శరీరం అంగీకరించి, హానికర పదార్థాల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. శిశువు DNAలో సగం తండ్రిది కావడంతో పిండాన్ని తల్లి శరీరం ఫారెన్ బాడీగా భావిస్తుంది. కొత్తగా శరీరంలో ప్రవేశించిన దేనిమీదైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.


