News January 20, 2025
బీఆర్ఎస్ మహా ధర్నాకు అనుమతి నిరాకరణ

TG: కేటీఆర్ నాయకత్వంలో నల్గొండలో రేపు బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ధర్నా నిర్వహించి తీరుతామని అంటున్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఈ ధర్నా చేపట్టనుంది.
Similar News
News January 9, 2026
కారులో ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

సంక్రాంతికి కారులో ఊరెళ్లేవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి. జర్నీకి ముందురోజే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. పొద్దున్నే సిటీ అవుట్ స్కట్స్ దాటేయండి. ఫుడ్, ఎక్స్ట్రా వాటర్ ఇంటి నుంచే తీసుకెళ్తే మంచిది. దాబాలు, రెస్టారెంట్లలో ఖాళీ ఉండదు. షార్ట్కట్లలోనే ట్రాఫిక్ ఎక్కువుండొచ్చు. మెయిన్ రోడ్లోనే వెళ్లడం సేఫ్. VJA హైవేలో 6 ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అటు వెళ్లేవారికి కాస్త ఇబ్బంది కలగొచ్చు.
News January 9, 2026
TET: ఇన్-సర్వీస్ టీచర్లలో 47.82% పాస్

AP: ఇన్-సర్వీస్ టీచర్లు రెండేళ్లలోపు టెట్ అర్హత సాధించాలనే సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి రాష్ట్రంలో 31,886 మంది పరీక్షలు రాశారు. అందులో 47.82% మంది పాసైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా 2012లోపు నియామకమైన టీచర్లు రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు 2025 SEPలో తీర్పునిచ్చింది. ఈ టెట్లో ఫెయిలైన వారు మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంది. అందులోనూ ఫెయిలైతే ఉద్యోగాలు కోల్పోతారు.
News January 9, 2026
97% మందికి వైకుంఠ ద్వార దర్శనం: CM CBN

AP: తిరుమల పవిత్రతను కాపాడేేందుకు భక్తుల సహకారం అవసరమని CM CBN అన్నారు. వైకుంఠ ఏకాదశిని అద్భుతంగా నిర్వహించిన TTDని అభినందించారు. DEC 30-JAN 8 వరకు 7.83 లక్షల మందికి వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 97% మంది సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం అభినందనీయమన్నారు. క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ నుంచి అమలు చేసిన అన్ని విధానాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు.


