News March 17, 2025
పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు AP MP కలిశెట్టికి లోక్సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు TDP ఎంపీలు గతంలో లోక్సభ స్పీకర్ను కోరగా తాజాగా అనుమతి లభించింది.
Similar News
News October 25, 2025
పార్టీకి నష్టం జరగొద్దనే పోరాట విరమణ: ఆశన్న

కేంద్ర బలగాల దాడులతో పార్టీకి నష్టం జరగొద్దనే సాయుధ పోరాటాన్ని విరమించామని మావోయిస్టు ఆశన్న తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి BR దాదా నాయకత్వంలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సమాచార లోపంతో కొంతమంది కామ్రేడ్లు దీన్ని తప్పుగా భావిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల 200 మంది మావోలతో కలిసి ఆశన్న ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. అంతకుముందు మల్లోజుల మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు.
News October 25, 2025
విడుదలకు సిద్ధమైన ‘మాస్ జాతర’.. రన్టైమ్ ఇదే

రవితేజ-శ్రీలీల ‘మాస్ జాతర’ రన్టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. అలాగే సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాలను వెల్లడిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘మాస్, ఫన్ అండ్ యాక్షన్ అన్నీ ఒకదాంట్లోనే. ఎంటర్టైన్మెంట్ మాస్వేవ్ను థియేటర్లలో ఆస్వాదించండి’ అని పేర్కొన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ OCT 31న రిలీజ్ కానుంది.
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్లో ఆధార్ లింక్ చేయాలని డెడ్లైన్ విధించింది. ఆధార్తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.


