News March 17, 2024
సువిధ యాప్ ద్వారా అనుమతులు: సీపీ

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఆరు చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశించారు. రాజకీయ సభలు, సమావేశాలకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 478 పోలింగ్ కేంద్రాలను స్వల్ప సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి రెండు స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
GVMC స్థాయీ సంఘంలో 160 అంశాలకు ఆమోదం

విశాఖ మేయర్, స్థాయీ సంఘం ఛైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో 159 ప్రధాన, 13 టేబుల్ అజెండాలతో మొత్తం 172 అంశాలు చర్చించారు. అవినీతికి ఆస్కారం ఉన్న 12 అంశాలను వాయిదా వేసి 160 అంశాలకు ఆమోదం తెలిపారు. విశాఖ భాగస్వామ్యం సదస్సు పనులకు ఆమోదం లభించగా, జీవీఎంసీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.
News January 29, 2026
ఏయూలో భారీ సంగీత సమ్మేళనం.. ఎప్పుడంటే?

ఆంధ్ర విశ్వవిద్యాలయం యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న భారీ సంగీత సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ బుధవారం ఆవిష్కరించారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏయూ ఓపెన్ ఎయిర్ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల కళా నైపుణ్యాన్ని చాటేలా ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు వీసీ పేర్కొన్నారు.
News January 29, 2026
విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విశాఖ విమానశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా అరకులో నిర్వహించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరయ్యేందుకు ముందుగానే విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలికారు. బీచ్ తీరంలో ఉన్న హోటల్‌కు ఆయన చేరుకున్నారు.


