News March 17, 2024
అనుమతులు తప్పనిసరి: భార్గవ తేజ
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు రావడంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కాన్వాసింగ్, లౌడ్ స్పీకర్స్, ఊరేగింపులు, మీటింగులు, బ్యానర్లు, పోస్టర్లు, హోల్డింగుల కోసం అనుమతులకు ఆన్లైన్లో (https://suvidha.eci.gov.in) ఎలా అప్లై చేసుకోవాలో డెమో నిర్వహించి అవగాహన కల్పించారు.
Similar News
News October 31, 2024
KNL: 7 బైక్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
కర్నూలు జిల్లా కౌతాళంలో బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బదినేహాల్లోని ఆదోని రోడ్డులో ఉన్న ప్రభుత్వాస్పత్రి వద్ద వన్నూర్ బాషా, మల్లికార్జునను అరెస్టు చేసినట్లు సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ మొహమ్మద్ రిజ్వాన్ తెలిపారు. వారి వద్ద నుంచి 7 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను ఆదోని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు చెప్పారు.
News October 31, 2024
స్వీయ సత్ప్రవర్తన ద్వారానే అవినీతి నిర్మూలన: కలెక్టర్
అవినీతిని అంతమొందించే ప్రక్రియ స్వీయ సత్ప్రవర్తన ద్వారానే సాధ్యమవుతుందని కలెక్టర్ జీ.రాజకుమారి ఉద్ఘాటించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వారోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.
News October 31, 2024
కర్నూలు: ముగిసిన బీఈడీ సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు రాయలసీమ వర్సిటీలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు బుధవారం నాటికి ముగిశాయి. వర్సిటీ పరిధిలోని 17 పరీక్షా కేంద్రాల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. చివరి రోజు పరీక్షకు 4,050 మంది విద్యార్థులు హాజరయ్యారు. 429 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నంద్యాల జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో వైస్ ఛాన్సలర్ ఎన్టీకే నాయక్ పరీక్షా నిర్వహణను పరిశీలించారు.