News March 18, 2024

PERRY: బిగ్ గేమ్ ఛేంజర్

image

ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ప్రతిభతో ఆ జట్టు కప్ కొట్టింది. టోర్నీలో ఆమె మొత్తం 347 పరుగులు బాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు. అలాగే బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. టోర్నీలో 7 వికెట్లు కూడా పడగొట్టారు. ముంబైపై 6 వికెట్లు తీసి డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా పెర్రీ నిలిచారు. ఫైనల్లో కూడా తన స్వభావానికి వ్యతిరేకంగా ఆడి జట్టును గెలిపించారు.

Similar News

News March 28, 2025

మీకు తెలుసా?.. రూ.45కోట్ల బడ్జెట్…రూ. లక్ష దాటని కలెక్షన్స్

image

బాలీవుడ్‌లో గతేడాది వచ్చిన లేడీ కిల్లర్ చిత్రం రూ.45కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ వంటి స్టార్‌లు నటించారు. ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్‌గా నిలిచింది. ఇందులో విషయమేముంది అనుకుంటున్నారా? ఈ మూవీ మెుదటి వారం రూ.1లక్ష కంటే తక్కువే వసూలు చేసిందట. అంతే కాకుండా, కొనుగోలు చేయడానికి OTTలు రాకపోవడంతో నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో మూవీని రిలీజ్ చేశారు.

News March 28, 2025

బిల్లులు చెల్లించండి.. సీఎంకు కాంట్రాక్టర్ల లేఖ

image

AP: సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్ల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ పనులు చేసిన గుత్తేదారులకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఆరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగాదికల్లా రూ.2కోట్ల లోపు బిల్లులను చెల్లించాలని కోరింది.

News March 28, 2025

ఛార్జీలు పెంపు.. మే 1 నుంచి అమలు

image

ATM ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నెలవారీ ఉచిత లావాదేవీలు దాటాక ఒక్కో లావాదేవీపై రూ.23 వసూలు చేయనున్నారు. కస్టమర్లు సొంత బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో సిటీలు అయితే 5 సార్లు, నాన్-మెట్రో సిటీలు అయితే 3 ట్రాన్సాక్షన్లకు ఛాన్స్ ఉంటుంది. వాటిని మించితే ప్రస్తుతం రూ.21 ఛార్జ్ చేస్తున్నారు. మే 1 నుంచి రూ.23 ఛార్జ్ చేయనున్నారు.

error: Content is protected !!