News March 24, 2025

PES స్నాతకోత్సవంలో మాజీ చీఫ్ జస్టిస్ రమణ

image

కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో 17వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ హాజరైయ్యారు. పీఈఎస్ విద్యా సంస్థ అధినేత దొరస్వామి నాయుడుకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో వైద్య విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.

Similar News

News October 17, 2025

చిత్తూరు: సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలను నిర్వహించనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ఇందుకు రూ.5 వేలను ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలన్నారు. ముందుగానే ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 16, 2025

17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఈ సమావేశంలో సమీక్షిస్తామని చెప్పారు. సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.

News October 16, 2025

కల్యాణ రేవు జలపాతంలో యువకుడి గల్లంతు

image

పలమనేరు రూరల్ మండలంలో కళ్యాణ రేవు జలపాతంలో గురువారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన యూనిస్ (23) స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు. కాగా దట్టమైన అడవిలో నెలకొన్న ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి సమాచారం పోలీసులు వెళ్లాడించాల్సి ఉంది.