News April 20, 2024

ఫిష్ మసాలా‌లో పురుగు మందు?

image

ఎవరెస్ట్ ఫిష్ మసాలాలో పురుగు మందు ఆనవాళ్లు ఉన్నట్లు సింగపూర్ ఆరోపించింది. అందులో ఇథలిన్ ఆక్సైడ్ ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటికే ఫిష్‌ మసాలా కొన్నవారు వాటిని వినియోగించవద్దని, వాడుతున్న వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆ దేశ ఫుడ్ ఏజెన్సీ సూచించింది. ఈ ఆరోపణలపై ఎవరెస్ట్ ఇప్పటి వరకు స్పందించలేదు.

Similar News

News April 18, 2026

జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

image

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>

News April 18, 2026

భద్రాచలం, బాసర ఆలయాలకు మహర్దశ

image

TG: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి <<19580372>>భూమిపూజ<<>> చేయడం తెలిసిందే.

News April 18, 2026

గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

image

దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ తగ్గిందని కేంద్రం తెలిపింది. రోజువారీ బుకింగ్స్ 46-50 లక్షల మధ్య ఉన్నాయని చెప్పింది. సిలిండర్ల సరఫరా కూడా స్థిరంగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ సప్లై సాధారణంగానే జరుగుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇరాన్, US శాంతి ఒప్పందానికి దగ్గరవడం, హార్ముజ్ జలసంధిని తెరవడంతో దేశంలో LPG కష్టాలు తప్పనున్నాయి.