News November 29, 2024

దర్గాపై పిటిషన్.. ముదురుతున్న వివాదం

image

మతపరమైన ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయిస్తున్నారు. సంభల్ అల్లర్లు చల్లారకముందే తాజాగా అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రదేశంలో గతంలో శివాలయం ఉండేదంటూ పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ భూమిలో ఈద్గాను నిర్మించారంటూ మథురలో, మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో, వారణాసిలోని జ్ఞానవాపిలో ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ వరుస పిటిషన్లు దాఖలవ్వడంతో ఈ తరహా వివాదాలు అధికమయ్యాయి.

Similar News

News April 3, 2026

రెండేళ్లుగా సింగరేణిలో తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి

image

TG: గత రెండేళ్లుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. 2025-26లో 72 మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఉత్పత్తి 58MTకే పరిమితమైంది. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఇది 16% తక్కువ. FY25లోనూ 72MT టార్గెట్ అయితే 69MTనే ఉత్పత్తి చేసింది. భారీ వర్షాలు, మార్కెట్‌లో లో గ్రేడ్ బొగ్గుకు డిమాండ్ తగ్గడం, సంస్థ బొగ్గు ధరలను పెంచడం, కొత్త గనుల మంజూరులో జాప్యం ఉత్పత్తి తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది.

News April 3, 2026

ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

image

★ 1914: భారత్ తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జననం
★ 1955: సింగర్ హరిహరన్ జననం
★ 1962: సినీనటి జయప్రద జననం
★ 1973: నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
★ 1680: మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణం
★ 1943: ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన

News April 3, 2026

రెండు భాగాలుగా బాలయ్య-వివేక్ ఆత్రేయ సినిమా?

image

యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పెద్ద కథ కావడంతో దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దర్శకుడి నరేషన్ నచ్చడంతో బాలయ్య సైతం ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి ‘కురుక్షేత్రం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్.