News December 2, 2024

ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్

image

TG: ఏటూరు నాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Similar News

News January 4, 2026

హిల్ట్ పాలసీపై రేపు అసెంబ్లీలో చర్చ

image

TG: BRS సవాల్‌తో నిన్న అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చించిన ప్రభుత్వం మరో కీలక అంశంపై డిబేట్‌కు సిద్ధమైంది. హిల్ట్ పాలసీపై రేపు సభలో చర్చించాలని నిర్ణయించింది. ఈ పాలసీ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. భూదోపిడీ కోసమే ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అసెంబ్లీ వేదికగా వీటిని తిప్పికొట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అయితే BRS సమావేశాలు బహిష్కరించింది.

News January 4, 2026

మేడారం జాతర.. టోల్ ‘ఫ్రీ’ పరిశీలిస్తున్నామన్న కోమటిరెడ్డి

image

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఊరటనిచ్చేలా టోల్ ఫీజు మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ‘సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వారికే కాదు, తెలంగాణ గడ్డపై జరిగే అతిపెద్ద జాతర మేడారానికి వెళ్లే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News January 4, 2026

ఫైరింగ్‌ నేర్చుకుని భార్యను కాల్చి చంపిన టెకీ

image

బెంగళూరులోని బసవేశ్వరలో గతనెల 24న జరిగిన బ్యాంకు మహిళా ఉద్యోగి హత్యకేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భార్య భువనేశ్వరిని చంపమని భర్త బాలమురుగన్ మొదట TNకు చెందిన వ్యక్తికి రూ.1.25లక్షలు సుపారీ ఇచ్చాడు. అతను చంపలేదని స్వయంగా తానే చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. బిహార్ వెళ్లి రూ.50 వేలకు గన్ కొన్నాడు. అక్కడే 15 రోజులు గన్ కాల్చడం నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపేశాడు.