News August 12, 2024
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్
TG: IAS స్మితా సబర్వాల్ <<13679127>>వ్యాఖ్యలపై<<>> హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దివ్యాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ దాఖలవగా, పిటిషనర్కు ఉన్న అర్హతను కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ దివ్యాంగురాలని అడ్వొకేట్ తెలపడంతో, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ‘ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా అవసరమా?’ అని స్మిత ప్రశ్నించడం వివాదమైన సంగతి తెలిసిందే.
Similar News
News January 15, 2025
ఇందిరా భవన్కు కాదు లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతాం: కాంగ్రెస్
ఢిల్లీలోని తమ కొత్త హెడాఫీసుకు ఇందిరా భవన్ పేరునే కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా పేరుమార్చి ఆయన్ను గౌరవించాలని <<15160758>>BJP<<>> అడగటంపై స్పందించింది. ఇందిరా భవన్లోని లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతామని ప్రకటించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి కొత్త ఆఫీసును బుధవారం ఆరంభించిన సంగతి తెలిసిందే.
News January 15, 2025
హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడెలా ఉన్నారో చూడండి!
ఒకప్పుడు టాలీవుడ్లో సూపర్ హిట్స్ పొందిన హీరో జేడీ చక్రవర్తి లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆయనతో సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేను, సత్య కలిసి సత్య సినిమా చూసేందుకు వెళ్తున్నాం’ అని ఆయన పోస్ట్ చేశారు. 1998లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో రీరిలీజ్ కానుంది.
News January 15, 2025
కేటీఆర్కు మరోసారి నోటీసులు?
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.