News October 30, 2024
ఉదయనిధి డ్రెస్ కోడ్‌పై హైకోర్టులో పిటిషన్
TN డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫార్మల్ డ్రెస్ కోడ్ పాటించడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అధికారిక కార్యక్రమాల్లో ఆయన పార్టీ చిహ్నాలను ప్రదర్శించే దుస్తులు ధరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఇది రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. దీనిపై విచారించిన కోర్టు స్పందన తెలియజేయాలని GOVTని ఆదేశించింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి డ్రెస్ కోడ్ విషయంలో నిబంధనలు పరిశీలించాలని ఏజీని కోరింది.
Similar News
News November 18, 2024
BREAKING: పోసానిపై సీఐడీ కేసు
AP: తెలుగు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోసాని మాట్లాడారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో ఆయనపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) BNS సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
News November 18, 2024
కిరణ్.. ‘క’ మూవీ చూసి కాల్ చేస్తా: అల్లు అర్జున్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్‌ను అభినందించారు. ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల సినిమాను చూడలేకపోతున్నా అని, కానీ తప్పకుండా మూవీ చూసి హీరో కిరణ్‌కు ఫోన్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. ‘పుష్ప-2’ ట్రైలర్ బాగుందని కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్‌కు ఐకాన్ స్టార్ ఇలా స్పందించారు.
News November 18, 2024
రేవంత్ పాలనలో 15 ఏళ్లు వెనక్కి: హరీశ్ రావు
TG: రేవంత్ పాలనలో తెలంగాణ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీలు బంద్ చేసి మూసీ దుకాణం తెరిచారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను నం.1గా మార్చారని చెప్పారు. పేదోళ్లతో పెట్టుకుని రేవంత్ హిట్ వికెట్ చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారని, బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.