News February 8, 2025

తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

image

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Similar News

News February 8, 2025

ఆధిక్యంలోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా

image

న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్(254+), జంగ్‌పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా(1800+) తొలిసారి ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మొదలైన దాదాపు రెండు గంటల తర్వాత ఆప్ అగ్రనేతలు లీడింగ్‌లోకి వచ్చారు. మరోవైపు కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీ, షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ వెనుకంజలో కొనసాగుతున్నారు.

News February 8, 2025

రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కథ ఇదేనా?

image

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం నడిచింది. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా కథ గురించి హింట్ ఇచ్చారు. ‘రాత్రుళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్, విచిత్రమైన కోణాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ కథ ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

News February 8, 2025

అనూహ్యం.. ముస్లింల ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం

image

ఢిల్లీలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత ఆప్ ఆధిక్యం కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయా స్థానాల్లో బీజేపీ దూసుకొచ్చింది. మొత్తం 12 స్థానాల్లో ప్రస్తుతం 7 చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. దీంతో ఆప్, కాంగ్రె‌స్‌‌ని కూడా ముస్లింలు ఆదరించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

error: Content is protected !!