News October 23, 2025

TET తీర్పుపై సమీక్షకు సుప్రీంలో పిటిషన్: APTF

image

AP: TETపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ఏపీటీఎఫ్ తెలిపింది. ‘2017లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం RTE-2010కి పూర్వం ఉన్న టీచర్లు కూడా TET పాస్ కావాలని సుప్రీం తీర్పిచ్చింది. అయితే అప్పటి టీచర్లకు టెట్‌ను వర్తింపచేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. 2010కి ముందున్న టీచర్లను దీని నుంచి మినహాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి’ అని విన్నవించింది.

Similar News

News October 24, 2025

న్యూజిలాండ్‌పై విజయం.. సెమీస్‌కు భారత్

image

WWCలో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచులో టీమ్ ఇండియా DLS ప్రకారం 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ <<18085029>>340<<>> పరుగులు చేసింది. ఛేదనలో వర్షం కురవడంతో లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్దేశించారు. భారత బౌలర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 271 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ చేరింది.

News October 24, 2025

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల

image

రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 10 నుంచి రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు TET కన్వీనర్ కృష్ణా రెడ్డి తెలిపారు. 9.30am నుంచి 12pm వరకు తొలి సెషన్, 2.30-5pm రెండో సెషన్ నిర్వహిస్తామన్నారు. రేపటి నుంచి నవంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. DEC 3న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది JAN 19న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు.

News October 24, 2025

AP న్యూస్ రౌండప్

image

*రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారు: మంత్రి అనగాని సత్యప్రసాద్
*గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయన్న నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: భూమన కరుణాకర్ రెడ్డి
*శ్రీశైలం దేవ‌స్థానానికి 35 రోజుల్లో రూ.4,08,69,958 ఆదాయం వచ్చిన‌ట్లు అధికారులు వెల్లడి
*విశాఖలో దొంగనోట్లు తయారు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తా అరెస్ట్. ప్రింటర్, ల్యాప్‌ట్యాప్ స్వాధీనం.