News October 3, 2025
వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

పర్యావరణవేత్త సోనమ్ <<17826407>>వాంగ్‌చుక్<<>>ను రిలీజ్ చేసేలా ఆదేశించాలని ఆయన భార్య గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఘర్షణలకు ఒకరిని బలిపశువును చేయాలని, లద్దాక్ పోలీసులు ఓ అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపించారు. తన భర్తను కలిసేందుకు తాను అర్హురాలిని కాదా అంటూ రాష్ట్రపతి ముర్ము, PM మోదీకి లేఖ రాశారు.
Similar News
News October 3, 2025
తాజా న్యూస్

* TG: సికింద్రాబాద్-ఫలక్‌నుమా రైల్వే లైన్‌పై ROBని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రూ.52.03 కోట్ల వ్యయంతో 360 మీటర్ల పొడవైన నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణం.
* AP: పల్నాడులోని సత్తెనపల్లిలో హోటల్ సిబ్బందితో ఘర్షణ.. YCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు
* వాయుగుండం బీభత్సం.. విశాఖలో 80 ప్రాంతాల్లో కూలిన చెట్లు
* వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 218/3
News October 3, 2025
రోజూ 30ని.లు నడిస్తే!

నడక మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నా చాలా మంది అడుగేయకుండా ఉన్నచోటే కూర్చుండిపోతున్నారు. కానీ రోజుకు 30 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గిస్తుంది. సెరోటోనిన్ & డోపమైన్ స్థాయులను పెంచి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని పెంచి, జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గిస్తుంది. SHARE IT
News October 3, 2025
మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు?

భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లను 10-12 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికే 1GB ప్లాన్లను తొలగించారు. సరసమైన ప్లాన్లు కనిపించట్లేదు. డేటా ప్లాన్‌లను బలవంతంగా రుద్దుతున్నారు. ధరలు భారీగా పెరిగాయి. అయినా TRAI స్పందించట్లేదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మీ కామెంట్?