News December 3, 2024
తొలి 3 రోజులు రివ్యూలు వద్దని పిటిషన్.. హైకోర్టు ఏమందంటే?

సినిమాలు విడుదలైన తొలి మూడు రోజుల వరకు సోషల్ మీడియాలో రివ్యూలపై నిషేధం విధించాలన్న తమిళ నిర్మాతల సంఘం పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఒకరి అభిప్రాయాన్ని నియంత్రించడం వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడమేనని జడ్జి స్పష్టం చేశారు. అయితే యూట్యూబ్‌లో సినిమాలపై విమర్శలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
Similar News
News December 11, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు.. 4 రోజులే గడువు

AP: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఈ నెల 15 వరకే గడువు ఉంది. ఆ తర్వాత మిలిగిన కార్డులను కమిషనరేట్‌కు పంపుతారు. అప్పటికీ తీసుకోనివాళ్లు సచివాలయాల్లో రూ.200 చెల్లించి, పూర్తి అడ్రస్‌తో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News December 11, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు

<
News December 11, 2025
నకిలీ విత్తనాలు అమ్మితే ₹30L వరకు ఫైన్ వేయాలి: TG ప్రభుత్వం

TG: నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలకు ₹50వేల నుంచి ₹30లక్షల వరకు ఫైన్, మూడేళ్ల జైలు, ఐదేళ్ల నిషేధం విధించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ‘విత్తనోత్పత్తి సంస్థ నిర్వాహకులు, డీలర్లు, పంపిణీదారుల విద్యార్హత అగ్రికల్చర్ డిప్లొమా/డిగ్రీగా ఉండాలి. ప్రత్యేక విత్తన రకాల నమోదు, విత్తన ధరలు నియంత్రించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి’ అని కేంద్ర విత్తన చట్టం-2025 ముసాయిదాపై నివేదిక ఇచ్చింది.


