News October 18, 2024
సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్

TG: గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటించట్లేదని అభ్యర్థుల తరఫు లాయర్ మోహిత్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల్లో తప్పులున్నాయంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసింది. ఆ తీర్పును వారు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.
Similar News
News January 10, 2026
శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్

మకరజ్యోతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు వచ్చే అవకాశం ఉండటంతో కేరళ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 12 నుంచి పంబాలో వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని తెలిపారు. ఇక జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు, అదే రోజున ఉదయం 10 గంటల నుంచి పంబా-సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అయ్యప్ప భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News January 10, 2026
ధనుర్మాసం: ఇరవై ఆరో రోజు కీర్తన

‘ఓ వటపత్రశాయీ! వ్రతం కోసం నీ చెంతకు వచ్చాము. మా పూర్వీకులు నడిచిన బాటలో ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలను ప్రసాదించమని వేడుకుంటున్నాము. నీ పాంచజన్యం వంటి తెల్లని శంఖాలు, వాద్యాలు, మంగళ గానాలు పాడే భక్తుల సమూహం మాకు కావాలి. వెలుగునిచ్చే మంగళ దీపాలు, వ్రత ధ్వజాలు అనుగ్రహించు. లోకాన్నంతా నీ కుక్షిలో ఉంచుకోగల నీకు ఇవి ఇవ్వడం కష్టమేం కాదు. కరుణించి మా వ్రతం విజయవంతమయ్యేలా దీవించు స్వామీ!’ <<-se>>#DHANURMASAM<<>>
News January 10, 2026
ఫిబ్రవరి 14న మున్సిపల్ ఎన్నికలు!

TG: రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నికలను ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 17న ప్రకటించొచ్చని తెలుస్తోంది. BCలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని పురపాలక శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది.


