News August 5, 2024

చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. విచారణ 2 వారాలు వాయిదా

image

AP: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పట్లో CID దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది మారినట్లు కోర్టు దృష్టికి లాయర్లు తీసుకెళ్లారు. ఈ కేసుపై సర్కారు నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున విచారణ 2 వారాలు వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో చంద్రబాబు 50+ రోజులు జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News March 7, 2026

BREAKING: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధర

image

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,50,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 7, 2026

సివిల్స్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు.. BRSపై విమర్శలు

image

TG: సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ ద్వారా సాయం పొందిన 20 మంది మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ‘గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకొని బతకాలని భావించింది. మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యం ఇచ్చి IASలు, IPSలుగా ఎదగాలని తోడుగా నిలుస్తోంది’ అని ట్వీట్ చేశారు. వారు TG పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.

News March 7, 2026

రాజకీయాల్లోకి త్రిష?

image

TVK చీఫ్ విజయ్‌‌-త్రిష డేటింగ్ రూమర్స్ మధ్య మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే త్రిష పొలిటికల్ ఎంట్రీ. తనకు CM అవ్వాలని ఉందంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్‌ తెరపైకి వచ్చాయి. త్వరలోనే విజయ్ TVK పార్టీలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సినిమాలకు సైన్ కూడా చేయడంలేదని మరో గాసిప్. ఇక భార్యతో విడాకుల సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ్ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.