News August 14, 2025

కుక్కల తరలింపుపై పిటిషన్లు.. అధికారులపై SC ఫైర్

image

ఢిల్లీలో వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ <<17396741>>పిటిషన్లు<<>> దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ సందర్భంగా అధికారులపై SC ఫైరైంది. ‘పార్లమెంట్ తీసుకొచ్చిన రూల్స్, చట్టాలు అమలు కావడం లేదు. లోకల్ అథారిటీస్ సక్రమంగా పని చేయట్లేదు. దీనిపై బాధ్యత తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించింది. పిటిషన్లపై ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది. అయితే గత తీర్పుపై స్టే విధించలేదు.

Similar News

News August 16, 2025

దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య

image

హైదరాబాద్ ఉప్పల్ రామంతాపూర్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడి(5)పై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేశాడు. రామంతాపూర్‌కు చెందిన బాలుడు ఈ నెల 12న కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. CC ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అనుమానితుడ్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బాలుడికి మాయమాటలు చెప్పి ముళ్ల పొదల్లో అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు.

News August 16, 2025

FLASH: క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

image

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.60 తగ్గి రూ.1,01,180కు చేరింది. 8 రోజుల్లో మొత్తం ₹2,130 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,750 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,26,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 16, 2025

త్వరలో కండక్టర్ ఉద్యోగాల భర్తీ?

image

TGSRTCలో త్వరలోనే కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. 1500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి RTC ప్రతిపాదనలు పంపింది. 2013 నుంచి ఈ నియామక ప్రక్రియ నిలిచిపోగా, ఏటా పెరుగుతున్న రిటైర్మెంట్లతో కండక్టర్ల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని రూట్లలో డ్రైవర్లకే ఆ బాధ్యతలు అప్పగిస్తుండటంతో, వారికీ భారం పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం అనుమతిస్తే త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.