News June 11, 2024
నీట్ రద్దు చేయాలంటూ పిటిషన్లు.. నేడు విచారణ

నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈనెల 4న విడుదలైన నీట్ ఫలితాల్లో ఏకంగా 67మంది ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దీంతో పేపర్ లీకైందంటూ పలువురు విద్యార్థులు ఆరోపించారు. దీంతో పరీక్షను రద్దు చేయాలంటూ 9 పిటిషన్లు దాఖలు కాగా.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 1, 2025
కృష్ణా: రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దిత్వా.!

దిత్వా తుఫాన్ రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. యంత్రాల సహాయంతో కోసిన ధాన్యం తేమ శాతం అధికంగా ఉండటంతో విక్రయదారులు తక్కువ రేటుకు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. వర్షం కురుస్తున్న కారణంగా ధాన్యం ఆరబెట్టుకుని అవకాశం లేదన్నారు.
News December 1, 2025
కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 1, 2025
ఎయిమ్స్ రాజ్కోట్లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్కోట్లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/


