News August 21, 2025
నివేదిక రద్దు చేయాలని పిటిషన్లు.. విచారణ వాయిదా

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలన్న <<17470256>>కేసీఆర్<<>>, హరీశ్ రావు పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోరగా, విచారణ రేపటికి వాయిదా పడింది.
Similar News
News August 21, 2025
‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం.. రేపు తెలంగాణ బంద్

TG: స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ రేపు తెలంగాణ బంద్‌కు OU JAC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దానికి జనగామ స్వర్ణకారులు, కొండమల్లేపల్లి (నల్గొండ) వ్యాపారులు మద్దతు ప్రకటించారు. నల్గొండలో రేపు మొబైల్ షాపులు బంద్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు తమపై విద్వేషపూరిత ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్వాడీ వ్యాపారులు DGPకి ఫిర్యాదు చేశారు.
News August 21, 2025
వారికి రూ.15 లక్షల సాయం

ఉద్యోగి చనిపోతే కుటుంబానికి ఇచ్చే డెత్ రిలీఫ్ ఫండ్‌ను EPFO భారీగా పెంచింది. గతంలో గరిష్ఠంగా ₹8.8 లక్షలుగా ఉన్న ఈ సాయాన్ని తాజాగా ₹15 లక్షలకు చేర్చింది. 2025 APR 1 తర్వాత ఎవరైనా ఉద్యోగి చనిపోతే అతని కుటుంబానికి ఈ మొత్తం అందుతుంది. 2026 APR 1 నుంచి ఈ ఎక్స్‌గ్రేషియా ఏటా 5% పెరుగుతుందని EPFO వెల్లడించింది. అటు మైనర్లకు అందాల్సిన డబ్బును గార్డియన్ షిప్ సర్టిఫికెట్ లేకుండానే ఇకపై ఇవ్వనున్నారు.
News August 21, 2025
బైక్‌లకు టోల్ ఫీజు అని ప్రచారం.. కేంద్రం వివరణ

టోల్ ప్లాజాల వద్ద టూవీలర్లకు సైతం ఫీజు వసూలు చేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై PIB FACTCHECK స్పందించింది. NHAI దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాల్లో బైకర్ల నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయట్లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన కూడా లేదని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. 4 లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకే టోల్ ఉంటుందని తెలిపింది.