News November 16, 2024
‘అమరన్’ థియేటర్పై పెట్రోల్ బాంబు దాడి
తమిళనాడులోని తిరునల్వేలిలో ‘అమరన్’ మూవీ ఆడుతున్న థియేటర్పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు 3 పెట్రోల్ బాంబుల్ని హాల్పైకి విసరడం సీసీ కెమెరాల్లో నమోదైంది. స్థానికుల మధ్య ఉన్న తగాదాలే దీనికి కారణమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై తమిళనాట కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 16, 2024
ఒకేసారి ఓలా, ర్యాపిడోలో రైడ్ బుకింగ్.. చిక్కులు తెస్తున్న కొత్త ట్రెండ్
నగరాల్లో ఓ కొత్త ట్రెండ్ ఆటోడ్రైవర్లకు ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. కొందరు కస్టమర్లు ఓలా, ర్యాపిడో రెండిట్లోనూ రైడ్ బుక్చేస్తున్నారట. తక్కువ ఛార్జ్ లేదా త్వరగా వచ్చిన ఆటో ఎక్కేసి వెళ్తున్నారని సమాచారం. దీంతో తమకు టైమ్, పెట్రోల్ వేస్ట్ అవుతోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. బిజీటైమ్లో తక్కువ దూరానికి వాళ్లు వేసే ఛార్జీల దెబ్బకు ఇలా చేయడంలో తప్పేముందని కస్టమర్ల వాదన. దీనికి పరిష్కారం ఏంటంటారు?
News November 16, 2024
హైదరాబాద్కు బయల్దేరిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు బయల్దేరారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం <<14625625>>విషమించిన<<>> విషయం తెలిసిందే. దీంతో ఆయన నేరుగా AIG ఆసుపత్రికి వెళ్లనున్నారు. మరోవైపు నారా లోకేశ్ విజయవాడ నుంచి ఆసుపత్రికి చేరుకున్నారు.
News November 16, 2024
మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?: కేటీఆర్
TG: మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకని నిలదీశారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ ‘కేసీఆర్, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తామని రేవంత్ అంటున్నారు. గతంలో ఇలా అన్న వాళ్లే తెలంగాణలో లేకుండా పోయారని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే’ అని స్పష్టం చేశారు.