News April 8, 2025

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ: కేంద్రమంత్రి

image

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ రాబోతున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు పెట్రోలియం రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ముందున్నాయన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రికి వినతి

image

రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రి సత్యకుమార్ ను కోరామని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, స్వప్న కుమారి తెలిపారు. విజయవాడలో సోమవారం కలిసి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రంపచోడవరం, పోలవరం కలపడం వలన షెడ్యూల్ ఏరియా అంతా ఒకే జిల్లాలో.. గిరిజనుల హక్కులు, చట్టాలకు భంగం కలుగకుండా ఉంటుందని చెప్పారు.

కొండెక్కిన ‘కోడిగుడ్డు’

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్‌లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్‌లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.