News November 15, 2025

PGIMERలో 13 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

చండీగఢ్‌లోని<> PGIMER<<>>లో 13 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, సోషల్ వర్కర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/BDS/AYUSH, డిగ్రీ (MLT), డిగ్రీ, PG(సోషియాలజీ, సైకాలజీ, సోషల్ వర్క్) ఇంటర్, BCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Similar News

News November 15, 2025

మరో కీలక మావో లొంగుబాటు?

image

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్‌తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.

News November 15, 2025

జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

image

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.

News November 15, 2025

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

image

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.