News December 23, 2024
PGRSకు 80 ఫిర్యాదులు: నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. PGRS కార్యక్రమానికి 80 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. ASP యుగంధర్ బాబు పాల్గొన్నారు.
Similar News
News December 24, 2024
లింక్ వస్తుంది.. మోసం మొదలవుతుంది: కర్నూలు ఎస్పీ
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సూచించారు. పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనల పట్ల జాగ్రత వహించాలని పిలుపునిచ్చారు. ‘లైక్, షేర్ చేస్తే .. రివ్యూలు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తారు. ఆలోచించండి, మోసపోకండి’ అని ఎస్పీ హెచ్చరించారు. మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News December 24, 2024
పారిశ్రామిక హబ్గా రాయలసీమ!
ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్క్లో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో రాయలసీమ రూపురేఖలు మారనున్నాయి. జపాన్ సంస్థ ₹14వేల కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రత్యక్షంగా 2వేలు, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించే అవకాశముందని చెబుతున్నారు. దీనికి అనుబంధంగా మరిన్ని కంపెనీలు రానున్నాయి. వేలాది మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉండటంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
News December 24, 2024
కొత్తపల్లి: పొలంలో గుర్తుతెలియని డెడ్బాడీ
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామ సమీపంలోని పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. ఎర్రమఠం గ్రామానికి చెందిన కొమ్ము శేఖర్ తన పొలానికి వెళ్లగా శవం కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.