News December 22, 2025

PGRSకు 27 అర్జీలు: SP రాహుల్ మీనా

image

అమలాపురం: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 27 సమస్యలు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీ రాహుల్ మీనాను కలిసి తమ సమస్యలను లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News December 25, 2025

నంద్యాల: రూ.8వేల మద్దతు ధరతో కొనుగోలు

image

నంద్యాల జిల్లాలో నాఫెడ్ ద్వారా రూ.8వేల మద్దతు ధరతో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. జిల్లాలో 1.17 లక్షల ఎకరాల్లో 70,562 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం 25,200 టన్నుల కొనుగోలుకు అనుమతులు వచ్చాయని, డీసీఎంఎస్, సహకార సంఘాల ద్వారా ఈ సేకరణ జరుగుతుందని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News December 25, 2025

నైతిక రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం!

image

దేశంలో నైతిక రాజకీయాలకు విలువ తెచ్చిన అజాతశత్రువు అటల్ బిహారి వాజ్‌ పేయి. ఒక్క ఓటుతో ప్రధాని పీఠం చేజారుతున్నా ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడని వ్యక్తిత్వం ఆయనది. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో హాస్య చతురత మేళవించిన ప్రసంగాలు, ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు. రోడ్లతో పాటు ఎయిర్, రైల్, టెలీ, షిప్ కనెక్టివిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ‘భారతరత్న’ అయ్యారు. ఇవాళ వాజ్‌పేయి జయంతి.

News December 25, 2025

ధనుర్మాసం: పదో రోజు కీర్తన

image

యోగనిద్రలో ఉన్న ఐదో గోపికను ఇతర గోపికలు ఇలా మేల్కొల్పుతున్నారు. ‘ఓ అమ్మా! తలుపు తీయకపోయినా పర్వాలేదు. కనీసం మా మాటలకు సమాధానమైనా ఇవ్వు. జ్ఞానుల మాటలు వినడం ఎంతో పుణ్యం. పరిమళభరిత తులసిమాలలు ధరించే నారాయణుడు మన వ్రతానికి ఫలితాన్నిస్తాడు. రాముడి చేతిలో హతుడైన కుంభకర్ణుడు తన నిద్రను నీకేమైనా ఇచ్చాడా? ఆలస్యం చేయక నిద్ర వీడి, మాతో కలిసి వ్రతాన్ని పూర్తి చేయి’ అని వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>