News October 5, 2025
PGRSను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రతి మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో PGRS నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్జీల సమాచారానికి ప్రజలు కాల్ నం.1100 ఫోన్ చేయవచ్చన్నారు.
Similar News
News October 5, 2025
రాజన్న సిరిసిల్లలో రేపు మంత్రి సీతక్క పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి సీతక్క పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీతక్క ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు నేసిన చీరలను పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News October 5, 2025
VZM ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం తెలిపారు. సోమవారం నుంచి పట్టణంలో జరగనున్న శ్రీపైడితల్లి తోలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు, భద్రత విధుల్లో ఉన్న నేపథ్యంలో గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించాలని కోరారు.
News October 5, 2025
ప్రకాశం ప్రజలకు పోలీస్ కీలక సూచన ఇదే!

మీ ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఉందా.. లేకుంటే సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం పోలీస్. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆధార్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే అకౌంట్ లో ఉన్న నగదు భద్రమని పోలీసులు సూచించారు.