News September 2, 2025

PGRSపై త్వరలో శిక్షణ: కలెక్టర్

image

CMO ఆదేశాల మేరకు త్వరలో PGRSకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. PGRSపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతినెలా విశ్లేషణ నిర్వహిస్తారని, అందువల్ల అధికారులంతా వచ్చిన వినతల పరిష్కారం పట్ల చిత్త శుద్ధి చూపించాలని ఆదేశించారు. అసలైన ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.

Similar News

News September 4, 2025

VZM: ‘50 వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలి’

image

స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ ద్వారా సంక్షేమ హాస్ట‌ళ్ల‌కు మ‌రుగుదొడ్ల సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఆర్‌డ‌బ్ల్యూఎస్, సంక్షేమ శాఖ‌ల ఉన్న‌తాధికారులతో త‌న ఛాంబ‌ర్‌లో గురువారం స‌మీక్షించారు. జిల్లాలో 15 హాస్ట‌ళ్ల‌లో మ‌రుగుదొడ్ల‌ను నిర్మించాల్సి ఉంద‌న్నారు. 11 సాంఘిక, 39 బీసీ హాస్ట‌ళ్ల‌లో మ‌రుగుదొడ్ల‌ నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

News September 4, 2025

VZM: ‘పరిశ్రమల స్థాపనకు సులువుగా అనుమతులు’

image

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు చేసిన వారికి సులువుగా అనుమతులను ఇవ్వాలని, దరఖాస్తుల పరిశీలన ఉదారంగా ఉండాలని JC సేతు మాధవన్ సూచించారు. గురువారం విజయనగరం కలెక్టరేట్లో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ పై వర్క్ షాప్ నిర్వహించారు. సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా గత ఏడాది 2257 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి నెలా జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ‌లో సమీక్షిస్తామన్నారు.

News September 4, 2025

VZM: 76 మంది ఉపాధ్యాయులకు రేపు సన్మానం

image

విజయనగరం జిల్లాకు చెందిన 76 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రేపు సన్మానించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం జరిపిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు.